|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 02:56 PM
యూపీ అలీగఢ్‌లో మహిళా కానిస్టేబుల్ హేమలత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్, కానిస్టేబుల్ కుల్వీర్ బల్యన్ ప్రేరేపించినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు అయింది. కొద్ది రోజుల క్రితం హేమలత, సందీప్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత కానిస్టేబుల్ కుల్వీర్‌తో పరిచయం కాగా.. హేమలత అతనితో కూడా పెళ్లి గురించి చర్చించింది. కల్వీర్‌ను ఇంటికి తీసుకొస్తానని.. ఓకే అనుకుంటే మ్యారేజ్ చేసుకుంటానని ఫ్యామిలీ మెంబర్స్‌కు మెసేజ్ చేసింది. కానీ ఇది జరగకముదే ఆత్మహత్య చేసుకుంది.
Latest News