|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 01:55 PM
కమిషన్లు కోసం కక్కుర్తి పడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నాశనం చేశాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్టు వ్యయం, ఎత్తు తగ్గిస్తున్నా కూటమి ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. దీనిపై పార్లమెంటులో ప్రకటన చేసినా తేలుకుట్టిన దొంగాల్లా మౌనంగా ఉన్న చంద్రబాబు, కేంద్రమంత్రులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో అమరావతిది అంతులేని కథ అయితే... పోలవరంది ముగింపు లేని కథ అని తేల్చి చెప్పారు. పోలవరాన్ని ఏటిఎంలాగా వాడుకున్న చంద్రబాబు.. కాఫర్ డ్యాం కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కడితే... వైయస్.జగన్ హయాంలో స్పిల్ వే, కాపర్ డ్యామ్ లు పూర్తిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు కేంద్రాన్ని వైయస్.జగన్ ఆమోదింపజేస్తే... తాజాగా అంచనా వ్యయాన్ని, ప్రాజెక్టు ఎత్తుని తగ్గిస్తున్నా నోరు మెదపకుండా కూటమి నేతలు.. పోలవరాన్ని నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు.
Latest News