|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 01:56 PM
ఎన్నికల సమయంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆ ధరల స్థిరీకరణ నిధి ఉండి ఉంటే అనంతపురం జిల్లాలో అరటి రైతు నాగలింగం ఆత్మహత్య చేసుకునేవాడు కాదని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే హడావుడిగా పోస్టుమార్టం చేయించి శవ రాజకీయం చేసింది కూటమి ప్రభుత్వమేనని, మేం రైతు గౌరవాన్ని కాపాడేవిధంగా వ్యవహరించామన్నారు. రైతుల కోసమే మా నాయకుడు వైయస్ జగన్ రాజకీయం చేస్తారని ఉద్ఘాటించారు. అనంతపురం జిల్లాలో అరటి రైతు నాగలింగం ఆత్మహత్యపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనాగరికమని ఆయన తీవ్రంగా విమర్శించారు. అనంతపురం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Latest News