|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 01:45 PM
వరుస తుపాన్లు, వరదల కారణంగా రైతులు నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై నిర్లక్ష్యం కాగా, సీఎం చంద్రబాబుకు రైతులంటే ఏహ్యభావమని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. మొంథా తుపాను, తాజా దిత్వా తుపానుతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఏదీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నేతలు వరద సాయాన్ని దొంగ బిల్లులు పెట్టి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి వారిలో లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి దుయ్యబట్టారు.
Latest News