|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 01:41 PM
వైయస్ఆర్‌సీపీ పిలుపు మేరకు వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ యాదవ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గుంతకల్లు పట్టణంలో పలు కళాశాలల్లో విద్యార్థుల మద్దతుతో నిర్వహించడం జరిగింది కార్యక్రమంకి ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పిపిపి విధానానికి వ్యతిరేకంగా మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ చేసే నిర్ణయాన్ని రద్దు చేయాలనీ గవర్నర్ గారికి విద్యార్థులతో సంతకాలు చేపిస్తు విద్యార్థులకి అవగాహన కార్యక్రమంని వారు నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యని వ్యాపారంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అలాంటి నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు మద్దతుగా నిలవాలని విద్యార్థులకి వారు పిలుపునిచ్చారు,కూటమి విద్య మీద చేస్తున్న కుట్రలను ట్రిప్పి కొట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనుకకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు నక్కా నారప్ప, గుంతకల్ పట్టణం ప్రధాన కార్యదర్శి శివ,అంజి,శర్మస్ పవన్, రాహుల్ రెడ్డి, ఫయాజ్,పులి కార్తికేయ, హరీష్,నాగేంద్ర, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Latest News