|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 01:40 PM
18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య, విద్యా రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించిందని సీఎం చంద్రబాబుపై వైయస్ఆర్‌సీపీ నేతలు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో ప్రజలకేం చేశామో చెప్పుకోలేకే.. సీఎం చంద్రబాబు పార్వతీపురం జిల్లాలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లో విమర్శలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... సినిమా సెట్టింగులతో సీఎం చంద్రబాబు పేరెంట్స్ టీచర్ మీట్ నిర్వహిస్తే... స్కూళ్లో లోటుపాట్లు ఎలా తెలుస్తాయని నిలదీశారు. జిల్లాకు హామీలిస్తారనుకుంటే ఉసూరుమనిపించారని తేల్చి చెప్పారు. తన శాఖలో ఏం జరుగుతుందో తెలియని గుమ్మడి సంధ్యారాణి ఓ ఫెయిల్యూర్ మంత్రి అని మండిపడ్డారు.
Latest News