|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 11:50 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. గతంలో ఏర్పాటైన జిల్లాల కేంద్రాలపై వివాదాలు కొనసాగుతుండగా, ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలో నెలకొన్న వివాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పందించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మాత్రమే ఉంటుందని, ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే దానిపై జరుగుతున్న చర్చ, ఊహాగానాలకు చెక్ పెడుతూ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ కూడా జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు.
Latest News