|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 03:11 PM
శుక్రవారం కర్నూలులో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు గ్రామ సేవకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వీఆర్ఏ సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. పేస్కేలు అమలు, అర్హులకు వీఆర్వో–రికార్డ్ అసిస్టెంట్ ప్రమోషన్లు, నామినీల నియామకం, అక్రమ డ్యూటీల రద్దు, రీ–సర్వే డ్యూటీలకు టీఏ, డీఏల అమలు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
Latest News