|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 10:32 AM
ఆర్బీఐ మరోసారి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన ఆర్‌బీఐ.. మరోసారి కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ లో 25 బేసిస్ పాయింట్లు, జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టిన విషయం తెలిసిందే.
Latest News