|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 03:01 PM
AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో, డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ కోటాను శుక్రవారం విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ దాతల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
Latest News