|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 02:05 PM
హిడ్మా ఎన్‌కౌంటర్‌పై విడుదల చేసిన లేఖలో మావోయిస్టులు పలు ఆరోపణలు చేశారు. నిరాయుధులుగా ఉన్న వారిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్‌తో పాటు అల్లూరి జిల్లాలోని ఐటీడీఏ కాంట్రాక్టర్లు ఇందులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇది కేంద్ర - రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల జాయింట్ ఆపరేషన్ అని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే సూత్రధారి అని ఆరోపించారు.
Latest News