|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:41 PM
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ.. భారత జట్టును ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్ నేతృత్యంలో 15 మంది సభ్యులను ఎంపిక చేసింది. మెడ గాయంతో ఇబ్బంది పడుతున్న వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను జట్టులోకి చేర్చింది. అయితే బెంగళూరులోని సీఓఈ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందిన తర్వాతే అతడు మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. లేకపోతే.. అతడు మ్యాచ్ ఆడలేడు.
ఇక ఆసియాకప్ 2025లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా .. తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న అతడు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సైతం జట్టులోకి వచ్చేశాడు. రింకూ సింగ్ , నితీశ్ కుమార్ రెడ్డికి నిరాశే ఎదురైంది. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. వారిద్దరినీ జట్టు నుంచి తప్పించారు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే జట్టుతో భారత్.. ప్రపంచకప్ బరిలోకి దిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్..
తొలి టీ20: డిసెంబర్ 09 - కటక్
రెండో టీ20: డిసెంబర్ 11 - ముల్లాన్‌పూర్
మూడో టీ20: డిసెంబర్ 14 - ధర్మశాల
నాలుగో టీ20: డిసెంబర్ 17 - లక్నో
ఐదో టీ20: డిసెంబర్ 19 - అహ్మదాబాద్
Latest News