|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 03:19 PM
గర్భధారణలో తండ్రి వీర్యకణాల నాణ్యత కూడా కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలతో పాటు వైద్యులు కూడా వివరిస్తున్నారు. పురుషుల జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, ధూమపానం వంటి అలవాట్లు వీర్యకణాల నాణ్యతను, జన్యు లక్షణాలను ప్రభావితం చేస్తాయని, ఇది గర్భధారణ మధుమేహం, ప్రీక్లాంప్సియా వంటి సమస్యలకు దారితీస్తుందని, పుట్టబోయే పిల్లల్లో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి రావచ్చని హెచ్చరించారు. పోషకాహారం, వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం, 7-8 గంటలు నిద్ర వంటివి పాటించాలని సూచించారు.
Latest News