|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 03:08 PM
సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారాని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లా, జీసస్ గురించి విమర్శించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం హిందూ దేవుళ్లను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కి లేదన్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవాల పట్ల చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Latest News