|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:03 PM
జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు దశాబ్దాలుగా పన్ను మినహాయింపు పొందుతున్న కండోమ్‌లపై 13 శాతం వ్యాట్ విధిస్తున్నట్లు ప్రకటించింది. గత మూడేళ్లుగా దేశంలో జననాల రేటు వరుసగా పడిపోతుండటంతో, ప్రజలను పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు 'ఒకే బిడ్డ' విధానాన్ని కఠినంగా అమలు చేసి, కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన చైనా.. ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.1993లో 'ఒకే బిడ్డ' విధానం అమల్లో ఉన్నప్పుడు కండోమ్‌లపై పన్నును తొలగించారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతుండటంతో ఆ మినహాయింపును ఎత్తివేశారు. ఈ కొత్త పన్ను విధానం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు, పిల్లల సంరక్షణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్‌ను రద్దు చేసి, కుటుంబాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది.
Latest News