|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:49 PM
ఎవరైనా ఓ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాకు అవమానం జరిగింది. దుఃఖం కలిగింది. మాకు కుర్చీ వేయలేదు. స్థానిక ఎమ్మెల్యేతో బాగుండాలి. మా జోలికి స్థానిక ఎమ్మెల్యే రాకూడదు. తమను పార్టీ అవమానించిందని చెప్పి ఇతర పార్టీల్లోకి వెళ్లడం చూశాం. కానీ ఏకంగా రాజీనామాలు చేయడం, వాటిని ఆమోదించాలని పట్టుబట్టడం ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. ప్రలోభాలు పెట్టడం, డబ్బులకు మనుషుల్ని కొనుక్కోవడం, వారి పదవులకు రాజీనామాలు చేయించి తద్వారా కొనుగోలుదారుల్ని కూడా చంద్రబాబు సిద్ధం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు.ఇంకా అయన మాట్లాడుతూ... ఏ పార్టీ నుంచి అయినా ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలకు వెళ్లిపోతే వారిని అనర్హుల్ని చేయమని స్పీకర్ చుట్టూ, కౌన్సిల్ ఛైర్మన్ చుట్టూ తిరగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. అలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తప్పుడు ఆచారాలకు సీఎం చంద్రబాబు తెర తీశారు. అంటే ఓ పెట్టుబడిదారుడిని వెతుక్కుని వచ్చి, వారితో బయానాలు ఇప్పించి, ఆ వెంటనే వారితో ఆ పదవులు కొనిపిస్తున్నారు. నాడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపడం నుంచి ఇప్పటివరకూ కూడా రాజకీయ నాయకులకు డబ్బు ఎర వేసి వారిని కొనడం చంద్రబాబు నైజం. చంద్రబాబు అనైతిక క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు వంటి తప్పుడు ఆలోచనలు ఉన్న వారు, రాజకీయాల్లో నైతిక విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టాలు అంటే గౌరవం లేని వాళ్లు కూడా వస్తారని నాడు రాజ్యాంగం రాసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా ఊహించి ఉండరు అని తెలిపారు.
Latest News