|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:50 PM
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎలాంటి తప్పు చేయలేదు. జంట హత్యల కేసుతో వారికెలాంటి సంబంధం లేదు అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. కాగా, నిన్నటి ప్రెస్‌మీట్‌లో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ... జూలకంటి కాదు.. జూలకంత్రి. పల్నాడు జిల్లాలో మొత్తం తెలుసు. గుండ్లపాడు జంట హత్యలు టీడీపీలో అంతర్గత పోరు వల్లే జరిగాయి. అయినా ఆ కేసులో పిన్నెల్లి సోదరులను ఇరికించి వేధించాలని చూస్తున్నారు. ఇంకా మా కాసు కుటుంబ ఆస్తులు, కాలేజీ భూములపైనా జూలకంటి బ్రహ్మారెడ్డి పిచ్చి ఆరోపణలు చేశారు. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను పుట్టక ముందే మా సొసైటీ చట్టబద్ధంగా ఏర్పడింది. సొసైటీ ద్వారా అక్రమ నిర్మాణాలు చేశామన్నారు కదా? కనీసం ఒక్క ఆధారమైనా చూపండి. మా పెద్దలు ఆస్తులు సంపాదించడం కోసం కాకుండా విద్యా సేవ కోసం భూములు కొనుగోలు చేశారు. మా కాసు కుటుంబం ఈ ప్రాంతం (ఇప్పుడు పల్నాడు జిల్లా) అభివృద్ధి కోసం ఎంతో చేసింది. అది వాస్తవం కాదనే ధైర్యం మీకుందా?. అలా ఉంటే పల్నాడు అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి. మీకు ఇదే నా సవాల్. ఎక్కడైనా ఆ చర్చకు నేను రెడీ అని సవాల్ విసిరారు.
Latest News