|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:48 PM
నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా కామాక్షి వైయస్ఆర్‌సీపీకి చెందిందంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం. ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు కాదా? ఇంకా అది ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా?. అయినా సీఎం చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీపై నెపం నెట్టుతున్నారు. కామాక్షి మా పార్టీకి చెందిందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది అత్యంత హేయం అని అన్నారు.
Latest News