|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:46 PM
బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పల్లికోన గ్రామంలో ఖరీఫ్ పంట నష్టంపై వైసీపీ శ్రేణులు వినూత్నమైన రీతిలో శవ యాత్ర చేయడం జరిగింది. రైతులకు ఖరీఫ్ కాలంలో అందవలిసిన సబ్సిడీ, ఇన్సూరెన్స్, యూరియా, పురుగు మందులు సకాలంలో అందించని కూటమి ప్రభుత్వం, పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించక పోవడంపై రైతులు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, రైతన్న కోసం వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Latest News