|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:44 PM
రాష్ట్రంలో ఒకవైపు పంటల కొనుగోలు లేక, మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడిక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా, అటు వైపు నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు, ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తెలిపారు.
Latest News