|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:38 AM
యూరప్ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. "మేం యుద్ధం కోరుకోవడం లేదు. కానీ యూరప్ కనుక యుద్ధాన్ని ప్రారంభించాలని అనుకుంటే.. దానికి మేం సంసిద్ధంగా ఉన్నాం" అని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ నేతలు శాంతి చర్చల్లో రష్యాకు ఆమోదయోగ్యం కాని డిమాండ్లను చొప్పించి, ఉక్రెయిన్ సంక్షోభంపై శాంతి అంగీకారాన్ని అడ్డుకుంటున్నారని పుతిన్ ఆరోపించారు. ట్రంప్ శాంతి ప్రణాళిక సవరణలపై చర్చించడానికి అమెరికా రాయబారులు మాస్కో చేరుకున్న వేళ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Latest News