|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 10:59 PM
మనం ఇంట్లో రెగ్యులర్‌గా దోశలు, పరాఠాలు, రోటీల కోసం పెనాన్ని వాడతాం. ఇది కొత్తలో బానే ఉంటుంది. కానీ, వాడే కొద్దీ గ్రీజు, మొండి మరకలతో నిండిపోయి చూడ్డానికి చాలా దారుణంగా మారుతుంది. కొన్నిసార్లు దీనిపై దోశలుకూడా సరిగా రావు. అలాంటప్పుడు ఎలా క్లీన్ చేయాలో తెలియదు. గట్టిగా రాద్దామంటే మళ్లీ దోశలు వస్తాయో లేదో తెలియదు. స్టీల్ స్క్రబ్ లాంటివి వాడొద్దు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే పెనం మళ్లీ కొత్తదానిలా మారుతుందో తెలుసుకోండి. పైగా రుద్దకుండానే ఈజీగా మరకలు ఎలా దూరమవుతాయో తెలుసుకోండి.
తోమడానికి కావాల్సిన పదార్థాలు
1 రూపాయి షాంపూ ప్యాకెట్
వంట సోడా
టూత్‌పేస్ట్
నీరు
ఎలా క్లీన్ చేయాలి
ముందుగా పాన్‌ని కాస్తా వేడి చేయండి. తర్వాత అందులో షాంపూ వేయండి. అందులోనే బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ కలపండి. తర్వాత పాన్‌లో బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ కలపండి. నురుగు వస్తుంటే చుట్టుపక్కల అంటూ మెల్లిగా స్క్రబ్ చేయండి. గట్టిగా రుద్దొద్దు. దీంతో గీతలు పడే అవకాశం ఉంది. కాబట్టి, మెల్లిగా అది కూడా సాఫ్ట్ బ్రష్‌తోనే రుద్దాలి.
క్లీన్ చేయడం
ఇలా మెల్లిగా రుద్దిన పెనాన్ని నీటితో క్లీన్ చేయండి. చాలా వరకూ మరకలు, నూనె మరకలు అన్నీ వదులుతాయి. షాంపూలోని గుణాలు జిడ్డు మరకల్ని వదులుస్తాయి. పైగా బేకింగ్ సోడా, టూత్ పేస్టు కూడా మసిని దూరం చేసి తెల్లగా మార్చేలా చేస్తాయి. దీంతో కొత్తదానిలా మారుతుంది.
ఎలా పనిచేస్తుంది
ఇప్పుడు చెప్పిన టిప్ గ్రీజు, మసి మరకల్ని దూరం చేయడంలో హెల్ప్ అవుతుంది. బేకింగ్ సోడా, టూత్‌పేస్టులోని గుణాలు మొండి మరకల్ని దూరం చేస్తాయి. షాంపూ నురుగుని పెంచి జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది. దీంతో చాలా వరకూ మొండి మరకలన్నీ వదిలిపోతాయి. ఇలా తోమడం వల్ల చాలా వరకూ పాన్‌పై ఉన్న మరకలు వదులుతాయి. ఇక్కడ షాంపూ మీరు ఏదైనా వాడొచ్చు.
పాన్‌ని కొత్తవాటిలా ఎలా తోమాలి?
ఎక్కువసార్లు వద్దు
అయితే, ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా మరకలు ఉన్నప్పుడు మాత్రమే ఇలా క్లీన్ చేయండి. తోమినప్పుడల్లా ఇలా చేయడం సరికాదు. అయితే, మీరు వాడేది ఐరన్ తవా అయినప్పుడు మాత్రమే ఇది చక్కగా పనిచేస్తుంది. నాన్‌స్టిక్‌ది వేడి చేసి తోమితే పైన కోటింగ్ పోతుంది. కాబట్టి, ఐరన్ కడాయి, తవాకి మాత్రమే దీనిని వాడండి.
Latest News