భారత్ కూల్చేసిన ఎయిర్‌బేస్‌లను తిరిగి నిర్మిస్తున్న పాక్
 

by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:35 PM

భారత్-పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల్లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు, వైమానిక స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన దాడుల్లో అవి తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. అయితే కొన్ని ఉగ్రవాద స్థావరాలను ఆ చోటు నుంచి వేరే చోటుకు మార్చగా.. మరికొన్నింటిని అక్కడే నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక పాక్ ఎయిర్‌బేస్‌లు ధ్వంసం కాగా.. వాటి శిథిలాలను తొలగించి.. అదే ప్రాంతంలో మళ్లీ కొత్త నిర్మాణాలను చేస్తున్నారు. తాజాగా బయటికి వచ్చిన శాటిలైట్ చిత్రాల్లో.. పాక్ ఎయిర్‌బేస్‌ల పునర్నిర్మాణాలు కనిపిస్తున్నాయి.


సుక్కూర్ ఎయిర్‌బేస్‌లోని.. మానవరహిత వైమానిక వాహనాలు ఉంచడానికి ఉపయోగించే.. దాడిలో పూర్తిగా ధ్వంసమైన హ్యాంగర్ శిథిలాలను పాకిస్తాన్ తాజాగా తొలగించింది. ఈ స్థలం ఇప్పుడు చదును చేయబడింది. మరోవైపు, రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లోని కమాండ్-అండ్-కంట్రోల్ సెంటర్‌ సైట్‌లో, దెబ్బతిన్న నిర్మాణాలను తొలగించి, ఇప్పుడు రెండు కొత్త నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఈ దాడులు, ఆ రోజు సాయంత్రం పాకిస్తాన్ కాల్పుల విరమణ చర్చలకు రావడానికి కొన్ని గంటల ముందు జరిగాయి, తద్వారా ఇరు దేశాల మధ్య 88 గంటల పాటు జరిగిన ఈ 'చిన్న యుద్ధం' ముగిసింది. IAF ఈ దాడుల్లో SCALP, రాంపేజ్, బ్రహ్మోస్ వంటి ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులను ఉపయోగించినట్లు తెలుస్తోంది.


సుక్కూర్ ఎయిర్‌బేస్‌


ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఈ ఏడాది మే 10వ తేదీన పాక్‌ గడ్డపై ఐఏఎఫ్ చేసిన దాడిలో.. సుక్కూర్ ఎయిర్‌బేస్‌లో మానవ రహిత వైమానిక వాహనాలను ఉంచే హ్యాంగర్ ధ్వంసం అయింది. మక్సర్ నుంచి వచ్చిన పాత ఉపగ్రహ చిత్రాలు.. హ్యాంగర్ పూర్తిగా ధ్వంసమైనట్లు తేలింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున చెట్లు మొలిచినట్లు కనిపించాయి. కానీ.. ప్రస్తుతం లభించిన కొత్త శాటిలైట్ చిత్రాల్లో మాత్రం.. దాడికి గురైన ఆ హ్యాంగర్ స్థలాన్ని పూర్తిగా చదును చేసినట్లు కనిపిస్తోంది. దాని పక్కన ఉన్న రెండో హ్యాంగర్‌ను మాత్రం తాకలేదు. భద్రతాపరమైన ప్రోటోకాల్స్, శిథిలాల కింద ఉన్న ప్రమాదకర పదార్థాల కారణంగా అక్కడ శిథిలాల తొలగింపు ప్రక్రియ ఆలస్యం అయ్యిందని జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ తెలిపారు.


నూర్ ఖాన్ ఎయిర్‌బేస్


పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌లో దాడి చేసింది. ఈ దాడిలో రెండు పెద్ద ట్రాక్టర్ ట్రైలర్‌లు దెబ్బతిన్నాయి. ఈ దాడి గురించి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్.. ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ ద్వారా సమాచారం అందుకున్నారు.


ఎట్ ఏ టైం ఎటాక్.. ఆపరేషన్ సిందూర్ జరిగిందిలా..


కొత్తగా విడుదలైన ఉపగ్రహ చిత్రాల్లో.. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో దెబ్బతిన్న భవనాల చుట్టూ ఉన్న శిథిలాలను తొలగించి.. ఆ ప్రాంతంలో రెండు కొత్త నిర్మాణాలు (సుమారు 20x25 మీటర్లు) కనిపిస్తున్నాయి. పాత పునాదిలోనే కొత్త నిర్మాణాలు.. ఉన్నప్పటికీ.. దాని నిర్మాణంలో మాత్రం మార్పులు ఉన్నట్లు అర్థం అవుతోంది.


ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. మే 7వ తేదీన పాకిస్తాన్ భూభాగంలో ఉన్న జైష్-ఎ-మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా స్థావరాలపై భారత్ దాడులు చేయడంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. మే 8వ తేదీన పాకిస్తాన్ 400 వరకు డ్రోన్‌లను ఉపయోగించి భారత దాడులను ప్రతిఘటించాలని చూసినా అది జరగలేదు.


పాక్ దాడులకు ప్రతీకారంగా మే 10వ తేదీన తెల్లవారుజామున భారత్ సుక్కూర్, నూర్ ఖాన్‌తో పాటు రహ్వాలీ, రఫీఖీ, సర్దోఘా సహా మొత్తం పది పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసింది. 1971 యుద్ధం తర్వాత భారత్ చేసిన అత్యంత వైమానిక దాడులు ఇవే కావడం గమనార్హం. చివరికి మే 10వ తేదీన మధ్యాహ్నం 3:35 గంటలకు పాకిస్తాన్ డీజీఎం, భారత డీజీఎంకు కాల్ చేసి కాల్పుల విరమణపై చర్చించడం ద్వారా 88 గంటల ఈ సైనిక పోరాటానికి తెరపడింది.

Latest News
Export booster: Adani's Dighi Port set to handle 2 lakh cars a year with Motherson partnership Fri, Dec 05, 2025, 11:39 AM
States must work towards a Bal Vivah Mukt Bharat: Annpurna Devi Fri, Dec 05, 2025, 11:38 AM
Rahul Gandhi targets Centre over IndiGo flights chaos, calls it result of 'monopoly model' Fri, Dec 05, 2025, 11:38 AM
Hollow promises for farmers' compensation exposed, says Shiv Sena(UBT) in Saamana Fri, Dec 05, 2025, 11:36 AM
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM