|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:01 PM
స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో, భారత మార్కెట్లోకి ఎ6ఎక్స్ 5జి పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో AI ఫీచర్లతో వస్తోంది. 6.7 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6జీబీ వరకు ర్యామ్, AI గేమ్ బూస్ట్, AI లింక్ బూస్ట్ 3.0 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 4జీబీ/6జీబీ ర్యామ్, 64జీబీ/128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ధర రూ.12,499 నుంచి ప్రారంభం కానుంది.
Latest News