|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:00 PM
ఎయిరిండియాకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం నవంబర్ నెలలో నెలరోజులపాటు దేశీయంగా సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే రాకపోకలు కొనసాగించడం కలకలం సృష్టిస్తోంది. అంతర్గత తనిఖీల్లో ఈ విషయం బయటపడటంతో, ఎయిరిండియా ఈ విషయాన్ని డీజీసీఏకు నివేదించింది. కారకులైన సిబ్బందిని సస్పెండ్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇటీవల ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం గమనార్హం.
Latest News