|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:55 PM
విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ మండలం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే, పియూసి చైర్మన్ కూన రవి కుమార్ పాల్గొన్నారు. ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై, నిర్వహణ సామర్థ్యాలు, కార్యాచరణ విధానాలపై మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని, టీడీపీని బలోపేతం చేయడానికి సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News