|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:17 PM
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మంగళవారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో అతిపిన్న వయసు (14 ఏళ్ల 250 రోజులు)లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర, బిహార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 108* (61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు 18 ఏళ్ల 118 రోజుల వయసులో విజయ్ జోల్ పేరిట ఉండేది. వైభవ్‌కు SMATలో ఇది తొలి శతకం.
Latest News