|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 11:45 AM
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. వర్క్ ఫ్రం హోమ్ అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కౌశలం’ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నేడు (డిసెంబర్ 2) ప్రారంభమయ్యాయి. గ్రామ–వార్డు సచివాలయాల్లో డిసెంబర్ 6 వరకు పరీక్షలు రెండు షిఫ్ట్‌ల్లో జరుగుతాయి. అభ్యర్థులకు కేంద్రం, పరీక్ష టైం వివరాలు మెసేజ్ చేశారు. కమ్యూనికేషన్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, సైకోమెట్రిక్‌తో పాటు విద్యార్హతలకు అనుగుణమైన టెక్నికల్ ప్రశ్నలు ఉంటాయి. 45 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాలి.
Latest News