|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 11:44 AM
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC) కొత్తగా 5 కీలక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం ప్రధానంగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ మరియు ఫైనాన్స్ రంగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంతో విలువైనది. డిసెంబర్ 3వ తేదీ (రేపు) అర్ధరాత్రి వరకే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ స్వీకరిస్తున్నారు కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోవాలి.
అర్హతల విషయానికొస్తే బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్ లేదా సివిల్) లేదా CA/CMA ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో కనీసం కొన్ని సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్‌షిప్ మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్‌లో భాగం.
ఎంపిక ప్రక్రియలో ముందుగా దరఖాస్తుల స్క్రూటినీ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్ష లేదు కాబట్టి అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం బలంగా ఉన్నవారికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 వరకు ఆకర్షణీయమైన జీతం అందుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరమైన ఉద్యోగం, మంచి పే స్కేల్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ ప్రొఫెషనల్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్. అర్హతలు సరిపోతే ఇప్పుడే https://www.nsic.co.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయండి – రేపటితో గడువు ముగుస్తోంది!