|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 10:37 AM
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, ఉదయం 7.26 సమయంలో వచ్చిన ఈ ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలతో భూమి కంపించినప్పటికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. తీవ్రత తక్కువగా ఉండటం, సముద్ర కేంద్రం కావడంతో సునామీ ముప్పు లేదని స్పష్టం చేశారు.
Latest News