|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 10:46 AM
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. జైమాలా వేడుక అనంతరం వధువు తన ప్రియుడితో కలిసి పారిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం గ్రామం మొత్తం వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి, ఆమె తన ప్రేమికుడితో వెళ్లిపోయినట్లు తెలియడంతో కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు, వధువు లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Latest News