|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:31 PM
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కుమారుడి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా, సామాజిక బాధ్యతతో జరిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఉజ్జయినిలో శనివారం జరిగిన ఒక సామూహిక వివాహ వేడుకలో మరో 21 జంటలతో పాటు తన చిన్న కుమారుడు అభిమన్యు యాదవ్ వివాహాన్ని ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అభిమన్యు.. డాక్టర్ ఇషిత మెడలో మూడు ముళ్లు వేశారు.సుమారు 25,000 మంది అతిథులు హాజరైన ఈ వేడుకను భారీ ఎత్తున ఏర్పాటు చేసినా, ఆడంబర ప్రదర్శనకు బదులుగా సామాజిక సమానత్వానికి పెద్దపీట వేశారు. వేర్వేరు సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన 22 జంటలు ఒకే వేదికపై ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మా కుమారుడు అభిమన్యు, కోడలు ఇషితతో పాటు మరో 21 జంటలు ఈ పవిత్ర వేడుకలో ఒక్కటయ్యాయి. సనాతన సంస్కృతి, సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.
Latest News