|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:29 PM
నెల్లూరు నగరంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మృతుడిని కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల గ్రామానికి చెందిన నాగమహేశ్వర్‌గా గుర్తించారు.వివరాల్లోకి వెళితే, నాగమహేశ్వర్ నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, తెలియని కారణాల వల్ల అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నాగమహేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
Latest News