సీటు కోసం ప్రయాణికుడుపై దాడికి పాల్పడిన మహిళ
 

by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:32 PM

ఆర్టీసీ బస్సులో సీటు కోసం జరిగిన ఓ చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ మహిళ సహ ప్రయాణికుడిపై దాడి చేసి, జుట్టు పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన తుని నుంచి నర్సీపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే, కొంతమంది మహిళలు ఓ సీటులో కర్చీఫ్ వేసి ఉంచారు. అది గమనించని ఓ ప్రయాణికుడు ఆ సీటులో కూర్చున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ మహిళ, "మేము కర్చీఫ్ వేసిన సీట్లో ఎలా కూర్చుంటావు?" అంటూ అతడితో వాగ్వాదానికి దిగింది. మాటామాటా పెరగడంతో ఆమె సహనం కోల్పోయి, సదరు ప్రయాణికుడి జుట్టు పట్టుకుని దాడి చేసింది. ఈ అనూహ్య పరిణామంతో అతడు నివ్వెరపోయాడు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే ఈ గొడవ జరిగింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో మహిళల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సీట్ల కోసం తరచూ ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. 

Latest News
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM
S&P upgrades India's insolvency regime on stronger creditor protection Thu, Dec 04, 2025, 04:54 PM