|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 03:06 PM
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. పలు రాష్ట్రాలకు సేవలందించిన రాధాకృష్ణన్ వ్యక్తిత్వం, సహనం అందరికీ ఆదర్శమని కొనియాడారు. సామాన్య రైతు కుటుంబం నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి చేరుకున్న సీపీ రాధాకృష్ణన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఆయన తనకు తెలుసని ప్రధాని అన్నారు. కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నుంచి రాధాకృష్ణన్ త్రుటిలో తప్పించుకున్నారని గుర్తుచేశారు. రాజ్యసభ ఛైర్మన్ గా రాధాకృష్ణన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
Latest News