|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 11:18 PM
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ .. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతడు ఈ ఫీట్ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు బాదాడు. 51 బంతుల్లో 57 పరుగులు స్కోరు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 269 వన్డే ఇన్నింగ్స్‌లలో 352 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిదీ (351 సిక్స్‌లు)ను అధిగమించాడు.
భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఎక్కడ లైవ్ చూడొచ్చు? షెడ్యూల్, జట్లు పూర్తి వివరాలివే..
వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన టాప్-5 ఆటగాళ్లు..
రోహిత్ శర్మ - 269 ఇన్నింగ్స్‌లలో 352 సిక్స్‌లు
షాహిద్ అఫ్రిదీ - 469 ఇన్నింగ్స్‌లలో 351 సిక్స్‌లు
క్రిస్ గేల్ - 294 ఇన్నింగ్స్‌లలో 331 సిక్స్‌లు
సనత్ జయసూర్య - 433 ఇన్నింగ్స్‌లలో 270 సిక్స్‌లు
ఎంఎస్ ధోనీ - 297 ఇన్నింగ్స్‌లలో 229 సిక్స్‌లు
టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్‌లలో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్లు..
వన్డే క్రికెట్ - రోహిత్ శర్మ 352 సిక్స్‌లు
అంతర్జాతీయ టీ20లు - రోహిత్ శర్మ 205 సిక్స్‌లు
టెస్ట్ క్రికెట్ - రిషభ్ పంత్ 94 సిక్స్‌లు
ఐపీఎల్ - రోహిత్ శర్మ 302 సిక్స్‌లు
టీ20లు - రోహిత్ శర్మ 547 సిక్స్‌లు
అంతర్జాతీయ క్రికెట్ - రోహిత్ శర్మ 645 సిక్స్‌లు
కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. భారత్‌కు టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ అందించిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడటమే లక్ష్యంగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేశాడు. తనకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో అదరగొడుతూ.. జూనియర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.
Latest News