|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 11:23 PM
దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగగా.. ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయారు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా సత్తాచాటడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ.. 120 బంతుల్లో 135 రన్స్ చేసి టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడిన యశస్వి జైశ్వాల్.. 16 బంతుల్లో 18 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అనంతరం రోహిత్‌కు.. విరాట్ కోహ్లీ జతకలిశాడు. వీరిద్దరూ తమ అనుభావాన్ని రంగరించి.. ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రెండో వికెట్‌కు 109 బంతుల్లో 136 రన్స్ జోడించారు.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ (51 బంతుల్లో 57 రన్స్) చేసిన తర్వాత వెనుదిరిగాడు. అయితే మరో ఎండ్‌లో కోహ్లీ మాత్రం అస్సలు తగ్గలేదు. పాత కోహ్లీని గుర్తు చేస్తూ.. ప్రొటీస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే 102 బంతుల్లోనే సెంచరీ మార్కుకు చేరుకున్నాడు. అతడికి వన్డేల్లో ఇది 52వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 83వ సెంచరీ కావడం గమనార్హం.
120 బంతుల్లో 135 రన్స్ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పరుగులు చేసే బాధ్యతను కేఎల్ రాహుల్ తీసుకున్నాడు. 56 బంతుల్లో 60 రన్స్ చేసి.. జట్టు స్కోరును 300 పరుగుల మార్కు దాటించాడు. రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32 రన్స్) కూడా బ్యాట్ ఝుళిపించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్.. 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కూ జాన్సెన్, నండ్రే బర్గర్, కార్బిన్ బాష్, బార్ట్‌మన్ తలా రెండు వికెట్లు తీశారు.
Latest News