|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:53 PM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 92 శాతం పనులు పూర్తి కాగా, డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో టెస్ట్ ఫ్లైట్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ ప్రాజెక్టు పనుల్లో అనూహ్యమైన వేగం కనిపిస్తోంది. ఆయన ప్రతి 15 రోజులకు ఒకసారి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, గడువులోగా విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.దేశంలోనే అతి పొడవైన రన్‌వేలలో ఒకటిగా నిలిచేలా 3.8 కిలోమీటర్ల రన్‌వే నిర్మాణం దాదాపు 99 శాతం పూర్తయింది. టెర్మినల్ భవనం 90%, ఏటీసీ టవర్ 72% పనులు పూర్తి చేసుకున్నాయి. మత్స్యాకారంలో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం ఇంటీరియర్ డిజైన్‌లో ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును జీఎంఆర్ సంస్థ నిర్మిస్తుండగా, ప్రస్తుతం 5,050 మంది కార్మికులు, ఇంజనీర్లు రేయింబవళ్లు పనిచేస్తున్నారు.
Latest News