|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:51 PM
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలో వర్షాలు కురుస్తున్నా, చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.నిన్న ఒక్కరోజే 79,791 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.73 కోట్లుగా నమోదైందని టీటీడీ వెల్లడించింది. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు, చల్లని వాతావరణం ఉన్నప్పటికీ భక్తుల విశ్వాసం ముందు ఇవేవీ అడ్డంకిగా నిలవలేదు. గోవింద నామస్మరణతో క్యూలైన్లలో ఓపికగా నిరీక్షిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు.
Latest News