|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:50 PM
శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం అక్కడి తమిళుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో కనీసం కడుపు నింపుకోలేని దుస్థితిలో పలు కుటుంబాలు సముద్ర మార్గంలో అక్రమంగా తమిళనాడుకు శరణార్థులుగా తరలివస్తున్నాయి. ఇలా వస్తున్న వారికి తమిళనాడు ప్రభుత్వం అండగా నిలుస్తూ, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తోంది.శ్రీలంకలో 2021 నుంచి మొదలైన ఆర్థిక సంక్షోభం ప్రజల బతుకులను అతలాకుతలం చేసింది. కోడి గుడ్డు ధర రూ.35, లీటరు పాలు రూ.1,195, కిలో పాల పొడి రూ.1,945కు చేరడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. పసిపిల్లలకు పాలు కూడా పట్టలేని దుస్థితిలో, ఉన్న ఆస్తులు అమ్ముకుని మరీ అనేక కుటుంబాలు ప్రాణాలను పణంగా పెట్టి తమిళనాడు బాట పడుతున్నాయి. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి రామేశ్వరానికి పడవల ద్వారా రాత్రి వేళల్లో చేరుకుంటున్నారు.
Latest News