|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:45 PM
ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా 46 ఏళ్ల మహిళా డాక్టర్ షాహీన్ సయీద్ పేరు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఒక వైద్యురాలు, రెండు విఫలమైన వివాహాలు, కొత్తగా దొరికిన ప్రేమ.. చివరికి ఆమెను ఉగ్రవాదం వైపు ఎలా నడిపించాయో దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న మరో డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను షాహీన్ 2023 సెప్టెంబర్‌లో వివాహం చేసుకుంది. ఈ బంధమే ఆమెను ఉగ్రవాద ప్రపంచంలోకి లాగిందని అధికారులు భావిస్తున్నారు. లక్నోలో విద్యావంతుల కుటుంబంలో పుట్టిన షాహీన్, అలహాబాద్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఫార్మకాలజీలో స్పెషలైజేషన్ చేసింది.
Latest News