మన సంస్కృతిని, ప్రకృతిని మనమే కాపాడుకోవాలి
 

by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:47 PM

ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుతమైన ప్రకృతి అందాలు, అటవీ సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో 'డిస్కవర్ ఆంధ్ర' అనే డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్ మన్నెపురి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, యంగ్ హీరో నవదీప్ సారథ్యం వహిస్తున్నారు. ఏపీ అటవీ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రూపొందుతున్న ఈ డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, మన సంస్కృతిని, ప్రకృతిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. "మన చుట్టూ ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఈ డాక్యుమెంటరీ చూస్తే తప్పక అనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం 2020లో 'గ్రీన్ పాస్' అనే ఎన్జీవో ప్రారంభించాను. నా 'రిపబ్లిక్' సినిమాలో కూడా ఇదే అంశాన్ని చర్చించాం. ఈ డాక్యుమెంటరీకి మణిశర్మ మ్యూజిక్ అందించడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రయత్నాలకు ప్రేక్షకులు, మీడియా మద్దతుగా నిలవాలి" అని కోరారు.

Latest News
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM
S&P upgrades India's insolvency regime on stronger creditor protection Thu, Dec 04, 2025, 04:54 PM