|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:44 PM
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయిప్రసాద్ నియమితులయ్యారు. ఆయన 2026 మార్చి 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. దీనితో ఆయన 2026 మార్చి 28 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ పొడిగింపునకు సంబంధించి జీవో నంబర్ 2230ను ప్రభుత్వం విడుదల చేసింది.
Latest News