|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:08 PM
గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ సమాజంలో ఉక్రెయిన్ పేరు నిత్యం వినిపిస్తూనే ఉంది. రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈక్రమంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రభుత్వంపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రభుత్వంలో సుమారు 10 కోట్ల డాలర్ల భారీ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అవినీతి నిరోధక సంస్థలు.. శుక్రవారం నాడు జెలన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఆంద్రీ యెర్మాక్ ఇల్లు, ఆఫీసుల్లో సోదా చేశాయి.
చమురు రంగంలో 10 కోట్ల డాలర్ల అవినీతి జరిగిందనే ఆరోపణల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఓ వైపు రష్యాతో యుద్ధం.. మరోవైపు అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకరించాలంటూ ఒత్తిడి చేస్తున్న క్రమంలో జెలెన్‌స్కీ మీద ఇలా అవినీతి ఆరోపణలు రావడం.. సోదాలు జరగడం.. ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికరమే అంటున్నారు.
అవినీతి నిరోధక సంస్థలు సోదాలు జరిపిని యెర్మాక్ నివాసం ఉండే అపార్ట్‌మెంట్.. రాజధాని కీవ్‌లో ఉంది. పైగా అది జెలెన్‌స్కీ కార్యాలయ సముదాయంలోనే ఉండటం గమనార్హం. అయితే యెర్మాక్ నివాసంలో సోదాలు జరిపిన వేళ జెలెన్‌స్కీ ఆ కాంప్లెక్స్‌లో ఉన్నారా లేరా అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అత్యంత సన్నిహితుడైన ఆండ్రీ యెర్మాక్‌పై అవినీతి ఆరోపణలు రావడతో ఆయనను తొలగించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఇది ఐరోపా సమాఖ్య లో చేరాలనుకుంటున్న జెలెన్‌స్కీకి పెద్ద సవాలుగా మారింది. ఈయూ, ఉక్రెయిన్‌లో అవినీతిని నిర్మూలించాలని షరతు విధించింది. గతంలో ఇదే చమురు కుంభకోణం కారణంగా ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా, యెర్మాక్ సహాయకులు కూడా రాజీనామాలు చేశారు.
ఒకప్పుడు జెలెన్‌స్కీకి వ్యాపార భాగస్వామిగా ఉన్న తైమూర్ మిండిచ్ ఈ చమురు కుంభకోణంలో కీలక సూత్రధారి అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తైమూర్ దేశం విడిచి పారిపోయినా, ఆయన పరోక్షంలో విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ చమురు కుంభకోణం నేపథ్యంలోనే ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.
యెర్మాక్ సహాయకుల్లో ఇద్దరు 2024లోనే తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, మరో సహాయకుడు ఇంకా విధుల్లోనే కొనసాగుతున్నారు. ఈ ముగ్గురిపై లంచగొండి ఆరోపణల దర్యాప్తు జరుగుతోంది. యెర్మాక్‌పై నేరుగా అవినీతిలో ప్రమేయం ఉందని ఆరోపణలు రాకపోయినా, ఆయనను తొలగించాలనే ఒత్తిడి పెరుగుతోంది.
ఐరోపా సమాఖ్య లో చేరాలని ఉక్రెయిన్ ఆశిస్తోంది. అయితే, దీనికి ముందుగా అవినీతిని నిర్మూలించాలని ఐరోపా సమాఖ్య షరతు పెట్టింది. రాజకీయాల్లో రావడానికి కన్నా ముందు.. యెర్మాక్.. న్యాయవాదిగా పనిచేశారు. సుమారు 15 ఏళ్ల క్రితం టీవీ కార్యక్రమాల ప్రొడక్షన్ విభాగంలో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో టీవీ హాస్య నటుడిగా పేరుగాంచిన జెలెన్‌స్కీతో అతనికి స్నేహం ఏర్పడింది. జెలెన్‌స్కీ దేశాధ్యక్షుడైన తర్వాత, యెర్మాక్ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా, కుడిభుజంగా మారారు. ప్రధానమంత్రి, ఇతర మంత్రుల నియామకంలో కూడా యెర్మాక్ కీలక పాత్ర పోషించారు.
Latest News