|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:51 PM
స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు వీడ్కోలు పలికారు. 14 సీజన్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, ఈ ఏడాది వేలంలో పాల్గొనట్లేదని ఆయన ప్రకటించారు. తన IPL ప్రయాణంలో సహకరించిన కోచ్‌లు, తోటి ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, అభిమానులకు డుప్లెసిస్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) సీజన్‌లో ఆడనున్నట్లు పేర్కొన్నారు. డుప్లెసిస్ తన IPL కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.
Latest News