న్యూఢిల్లీతో సైనిక ఒప్పందానికి మాస్కో ఆమోదం.. భారత్‌కు శుభవార్త చెప్పిన రష్యా
 

by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:44 PM

న్యూఢిల్లీ వేదికగా వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు కారణం నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు రానుండగా.. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన అనంతరం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాదు, రష్యా నుంచి నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు సుంకాలు విధించిన నేపథ్యంలో మాస్కో అధినేత భారత పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. డిసెంబరు 4,5 తేదీల్లో పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.


కాగా, పుతిన్ పర్యటనకు ముందు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో చేసుకున్న సైనిక ఒప్పందాన్ని మాస్కో పార్లమెంట్‌లో ఆమోదం తెలుపనున్నటు తెలుస్తోంది. అధికార వర్గాలు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఒప్పందంతో భారత్‌- రష్యాల మధ్య సైనిక సహకారం మరింత బలోపేతం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న భారత్‌- రష్యాల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఆ దేశ రక్షణ మంత్రి అలెగ్జాండర్‌ ఫోమిన్‌, రష్యాలో భారత రాయబారి వినయ్‌ కుమార్‌లు ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.


ఆ దేశ పార్లమెంట్ డుమా తన రాటిఫికేషన్ డేటాబేస్‌లో రష్యా ప్రభుత్వ నోట్‌తో పాటు RELOSను అప్‌లోడ్ చేసింది. ‘ఈ ఒప్పందం ఆమోదం సైనిక రంగంలో రష్యా, భారతదేశం మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుందని రష్యా ప్రభుత్వం విశ్వసిస్తుంది’ అని పేర్కొంది. భారత్- రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం డిసెంబరు 4-5 తేదీల్లో పుతిన్ న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ వెళ్తున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా పుతిన్‌, మోదీల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. అలాగే, భారత రాష్ర్టపతి ద్రౌపదీ ముర్ము.. పుతిన్‌కు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. అంతేకాదు, ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Latest News
Putin thanks PM Modi for making efforts to resolve Ukraine conflict Fri, Dec 05, 2025, 02:22 PM
Broad labels Root's Gabba ton as 'one of his best' Fri, Dec 05, 2025, 02:05 PM
1st Test: Hope, Greaves's fightback keep WI alive against NZ in Christchurch Fri, Dec 05, 2025, 02:03 PM
Hazlewood suffers low-grade achilles injury during rehabilitation from hamstring blow: CA Fri, Dec 05, 2025, 02:02 PM
PM Modi, Russian President Putin hold talks at Hyderabad House Fri, Dec 05, 2025, 12:46 PM