|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 05:25 PM
పిన్నెల్లి సోదరులపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బడుగు, బలహీన వర్గాలను హింసించి, హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకులు పిన్నెల్లి సోదరులని ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కళ్లు నెత్తికెక్కేలా పేట్రేగిపోయిన అరాచక శక్తి పిన్నెల్లి కుటుంబమని విమర్శించారు.మాచర్ల నియోజకవర్గాన్ని రావణకాష్ఠంలా మార్చి, తాలిబన్ల వలె ప్రతిపక్షాలు, ప్రజలపై దారుణ దమనకాండకు తెగబడ్డ దౌర్జన్యకారులని తీవ్రంగా విమర్శించారు. మాచర్ల నియోజకవర్గాన్ని ఆటవిక రాజ్యంగా, అరాచకాలకు అడ్డాగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. సహజ వనరులన్నింటినీ దోచుకున్నారని, మాఫియాను నడిపించారని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేకుండా నిర్మూలించాలన్నట్టుగా బరితెగించారని మండిపడ్డారు. ఎందరో తెదేపా కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News