|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 05:24 PM
టెస్టుల్లో బ్యాటింగ్ అంటే క్రీజులో పాతుకుపోవడమని, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి బ్యాటర్లు ఇప్పుడు కరువయ్యారని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ప్రస్తుతం టీ20లు, వన్డే మ్యాచ్‌లు ఎక్కువగా ఆడుతుండటంతో బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కొనే అవకాశాలు బ్యాటర్లకు తక్కువగా వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు.స్పిన్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు ఓపికతో ఆడాలని, ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండాలని కపిల్ దేవ్ సూచించాడు. స్పిన్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఎంతో నైపుణ్యం అవసరమని ఆయన అన్నాడు. టర్న్, బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం కష్టమని, ఫుట్ వర్క్ అనేది కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నాడు.
Latest News