|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 04:03 PM
నేరాల నియంత్రణకు పోలీసులు సీసీ కెమెరాలను అస్త్రాలుగా వాడుతున్నారని, విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అనేక కాలనీలు, అపార్ట్‌మెంట్‌లో వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని కేశినేని చిన్ని అన్నారు. పటమట పోలీస్టేషన్ పరిధిలో తొమ్మిది కాలనీల్లో నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాలను రిమోట్ ద్వారా ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. అతిథులకు ఎసీపీ దామోదర్, పటమట సీఐ పవన్ కిషోర్ మొక్కలు ఇచ్చి సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ మాట్లాడుతూ.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి మంగళవారం నాటికి ఏడాది అయ్యిందని, ఈరోజు తొలి సమావేశం మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనలు, సలహాలు తనకు ఎంతో పని చేశాయన్నారు. నన్ను ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి, కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పని చేస్తున్నారని, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. డ్రోన్‌ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారని అన్నారు. టెక్నాలాజీని అందిపుచ్చుకోవడంలో ఆయన ప్రతిభ అపారమని అన్నారు.
Latest News