మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య
 

by Suryaa Desk | Tue, Jun 24, 2025, 02:30 PM

భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో తన ఇద్దరి పిల్లలతో సహా ఆమె బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మరణించారు. బావిలో మెట్లు పట్టుకుని కుమార్తె ఉంది. దీంతో స్థానికులు వెంటనే బాలికను రక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు.అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని తమ దర్యాప్తులో తెలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే ఆమె విసిగిపోయి.. ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిందని పోలీసులు వివరించారు. ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పేరిట నగదును ఖాతాలో వేసింది. ఈ ఖాతాలోని నగదును తన ఖాతాలోకి మళ్లించాలంటూ భార్యపై భర్త తీవ్ర ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో ఏర్పాటైన వివాదం వలన ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Latest News
'New dawn of trust': Nitin Nabin ahead of BJP govt formation in Bengal Sat, May 09, 2026, 10:48 AM
Messi backs Neymar for World Cup return Sat, May 09, 2026, 10:39 AM
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM